Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' టీమ్ దీపావళి సంబరాలు... స్పెషల్ ఫోటో ఫీచర్...

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (12:43 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరావు రాం చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్ర బృందం దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
 
ఫోటోల్లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లతో కలిసి రాజమౌళి సంభాషణ జరుపుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ వారు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ చేసింది.
   
తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఎన్టీఆర్, రాంచరణ్ కనపించారు. సినిమా గురించి తారక్, చెర్రీకి రాజమౌళి వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి.
 
రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ పేర్లు కలిసేలా ఈ సినిమా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చెర్రీ, తారక్ కలిసి, అలాగే విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు.
 
కాగా, ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన  'భీమ్‌ ఫర్‌ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు అలరించిన విషయం తెలిసిందే. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ ఈ టీజర్లలో అలరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments