Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని మించిపోయే రెండు సినిమాలు.. అవేంటో తెలుసా?

తెలుగు చిత్రసీమ వైపు ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమా ది బిగినింగ్- ది కన్‌క్లూజన్‌లు రికార్డుల మీద రికార్డులు సాధించాయి. కలెక్షన్ల పరంగా కుమ్మేశాయి. జక్కన్న చెక్కిన బాహుబలి సి

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (17:13 IST)
తెలుగు చిత్రసీమ వైపు ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమా ది బిగినింగ్- ది కన్‌క్లూజన్‌లు రికార్డుల మీద రికార్డులు సాధించాయి. కలెక్షన్ల పరంగా కుమ్మేశాయి. జక్కన్న చెక్కిన బాహుబలి సినిమా భారతీయ సినిమాలో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా రికార్డులను అధిగమించేందుకు రెండు భారతీయ సినిమాలు సిద్ధమవుతున్నాయి. 
 
బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుతం బాహుబలి రికార్డును బ్రేక్ చేసేందుకు థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, రోబో 2 పాయింట్ ఓ సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించే థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాను విజువల్ వండర్స్‌గా రూపొందిస్తున్నారు. 1769వ సంవత్సరం కాలం నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.
 
అమితాబ్, అమీర్ ఖాన్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కించింది. గ్రాఫికల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. పైరేట్స్ ఆఫ్ కరేబియన్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని సినిమాను తీసినట్లు తెలుస్తోంది. 
 
భారత వెండితెరపై ఇలాంటి విజువల్స్ ఇప్పటి వరకు రాలేదు. అందుచేత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను చక్కగా ప్రమోట్ చేస్తే.. బాహుబలిని మించిపోవడం ఖాయం. థగ్స్ ఆఫ్ హిందూస్తా‌న్‌తో పాటు ఇండియాలో హైప్ క్రియేట్ అయిన సినిమా రోబో 2 పాయింట్ ఓ కూడా బాహుబలి రికార్డులను కొల్లగొట్టే ఛాన్సుంది. ఈ సినిమా రోబోకు కొనసాగింపుగా వస్తున్నది. 
 
రజినీకాంత్, అక్షయ్ కుమార్‌లు నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేస్తుండటంతో సినిమాకు ప్లస్ అనుకోవచ్చు.  సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. గ్రాఫిక్స్ కోసమే దాదాపుగా రూ.540 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాను కూడా చక్కగా ప్రమోషన్ చేస్తే.. రికార్డులు, కలెక్షన్లు ఖాయమని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. అమీర్, అమితాబ్‌లు నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాకు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. సముద్రంలో ఉండే దొంగలకు, బ్రిటిష్ వాళ్లకు జరిగిన పోరాటమే ఈ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఈ సినిమాను కొంతమంది మీమ్స్‌లా చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు వీటినే మంచికోసం ఉపయోగిస్తున్నారు. రాజకీయ నాయకులు నువ్వు దొంగవు అంటే నువ్వు దొంగవు అని చెప్పి థగ్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.  
 
పోలీసులు మాత్రం వినూత్నంగా ఈ సినిమాను కొత్తగా వినియోగించుకుంటున్నారు. సముద్రంలో తిరుగాడే దొంగలకు ముంబై సిటీలో స్థానం లేదని, వారు సిటీలోకి అడుగుపెట్టలేరని చెప్తూ మీమ్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments