Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2.O 'అంతకుమించి' ఉంటుందట... రూ.544 కోట్ల విజువల్‌ వండర్‌

సాధారణంగా ఒక సినిమా అంటే.. మహా అయితే, రూ.25 లేదా రూ.50 లేదా రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరక్కిస్తుంటారు. బాహుబలి వంటి చిత్రాన్నే రెండు భాగాలకు కలిసి సుమారుగా రూ.150 నుంచి రూ.200 కోట్లు వ్యయం చేసినట్టు సమ

Advertiesment
2.O 'అంతకుమించి' ఉంటుందట... రూ.544 కోట్ల విజువల్‌ వండర్‌
, బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:46 IST)
సాధారణంగా ఒక సినిమా అంటే.. మహా అయితే, రూ.25 లేదా రూ.50 లేదా రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరక్కిస్తుంటారు. బాహుబలి వంటి చిత్రాన్నే రెండు భాగాలకు కలిసి సుమారుగా రూ.150 నుంచి రూ.200 కోట్లు వ్యయం చేసినట్టు సమాచారం.
 
కానీ, ఎస్. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం '2పాయిట్O' చిత్రం ఏకంగా రూ.544 కోట్ల వ్యయంతో తెరకెక్కుతోంది. అంటే ఇది 75 మిలియన్ డాలర్ల విజువల్ వండర్ అన్నమాట. 
 
ఈ విషయాన్ని ఈ చిత్రంలో విలన్‌గా ఓ విభిన్న పాత్ర పోషించిన అక్షయ్‌ కుమార్‌ బహిర్గతం చేశాడు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. '75 మిలియన్‌ డాలర్ల (అంటే రూ. 544 కోట్లు అన్నమాట) విజవల్‌ వండర్‌' అని సోమవారం వెల్లడించాడు. ఆ ట్వీట్‌తో ఈ చిత్ర బడ్జెట్‌పై ఇప్పటివరకు ఉన్న ప్రచారాలకు తెరపడినట్టయింది. 
 
రజినీకాంత్ గతంలో వచ్చిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో 'రోబో' చిత్రంతో పోల్చితే "అంతకుమించి" ఉండాలన్న తపనతో నిర్మాణపరంగా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ కూడా సినిమా బడ్జెట్‌కు ఆకాశమే హద్దు అనే రీతిలో ఖర్చు పెట్టింది. ఇంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న తొలి భారతీయ సినిమా '2.0'. అలాగే పూర్తిగా 3డీలో తీసిన మొదటి సినిమా కూడా ఇదే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పాత్ర నేను చేయలేనంటున్న నాగబాబు.. వెంటపడుతున్న క్రిష్‌..?