Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

దేవీ
గురువారం, 19 జూన్ 2025 (17:02 IST)
Vishnu Manchu, Avram Manchu
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది.  ఇలాంటి సమయంలో విష్ణు ఓ ఎమోషనల్ ట్వీట్ వేశారు. తన తనయుడు అవ్రామ్ మంచు తెరంగేట్రం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు మంచు, విష్ణు మంచు కొడుకు అవ్రావ్, కుమార్తెలు అరియానా -వివియానా నటించడం ఓ రేర్ ఫీట్. ఇలా మూడు తరాలు కలిసి నటించిన అతి కొద్ది ప్రముఖ చిత్రాల్లో ‘కన్నప్ప’ నిలిచింది.
 
అవ్రామ్‌ ‘కన్నప్ప’ చిత్రంలో తిన్నడు చిన్నప్పటి పాత్రలో కనిపిస్తారు. ట్రైలర్‌లోనూ అవ్రామ్‌కు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఇక ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని విష్ణు మంచు షేర్ చేశారు. ‘‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు. అవ్రామ్ సెట్‌లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం.. ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు. ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.. ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు.. నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను. అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ట్వీట్ వేశారు.
 
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్ని పోషించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments