Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

దేవీ
గురువారం, 19 జూన్ 2025 (16:50 IST)
Virat Karna
హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం 'నాగబంధం' చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ప్రీ-లుక్, ఫస్ట్ లుక్  కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విరాట్ కర్ణ పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
 
సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం, మేకర్స్ ఒక కీలకమైన సన్నివేశాన్ని, ఒక పాటను భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్ లో చిత్రీకరించారు. అద్భుతంగా నిర్మించిన ఈ సెట్ సందర్శించి మీడియాను సర్ ప్రైజ్ చేసింది. కేరళలోని అసలు దేవాలయానికి కచ్చితమైన ప్రతిరూపంగా కనిపిస్తోందని ఎంతోమంది ప్రశంసించారు.
 
ఈ పాటలో ప్రముఖ బాలీవుడ్  కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణతో పాటు 5000 మంది నృత్యకారులు పాల్గొంటున్నారు. ఈ అద్భుతమైన సీక్వెన్స్  ఎప్పటికీ  గుర్తుండిపోయేలా వుంటుంది.
 
ఒక్క ఎపిసోడ్‌కే రూ. 10 కోట్లు బడ్జెట్ కేటాయించారు. 'నాగబంధం' ఒక విజువల్ స్పెక్టకిల్‌గా ఉండబోతోంది. ఈ ఎపిసోడ్ కోసం వేసిన భారీ సెట్‌, అంతే స్థాయిలో నిర్మాణం  టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
 
ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా..జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments