హీరో విరాట్ కర్ణ పాన్-ఇండియా మూవీ నాగబంధం. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న ఆమె సెట్స్ నుంచి ఫోటో షేర్ చేశారు. రాయల్ లుక్ లో కనిపిస్తున్న చేతులుని ప్రజెంట్ చేసే ఈ ఫోటో చాలా క్యురియాసిటీ పెంచింది.
ది సీక్రెట్ ట్రెజర్ అనే ట్యాగ్‌లైన్‌తో నాగబంధం ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్‌ను తీసుకువస్తున్నారు. NIK స్టూడియోస్ ఆధ్వర్యంలో కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా గర్వంగా సమర్పిస్తున్నారు.
పాన్ ఇండియన్ ఫిల్మ్ నాగబంధం ఒక పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో వుంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్, జగపతి బాబు, రిషభ్ సహానీ, జయప్రకాష్, జాన్ విజయ్, మురళీ శర్మ, అనసూయ, శరణ్య, ఈశ్వరిరావు, జాన్ కొక్కిన్, అంకిత్ కొయ్య, సోనియా సింగ్, మాథ్యూ వర్గీస్, జాసన్ షా, బి.ఎస్.అవినాష్, బేబి కియరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.