హీరో ఆకాష్ జగన్నాథ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "తల్వార్". ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు.యువ దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు అశ్వథ్థామ ,లక్ష్య సినిమాలకి రైటర్ గా పని చేసి “రణస్థలి” అనే సినిమా డైరెక్ట్ చేసారు.ఈ చిత్రంలో పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్, షిన్ టామ్ చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా "తల్వార్" సినిమా నుంచి పవర్ ఫుల్ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
"తల్వార్" ఆడియో గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. వాయిస్ ఓవర్ లో ఆకాష్ జగన్నాథ్ తరతరాలుగా జరుగుతున్న యుద్ధం, రక్తపాతం గురించి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. యుద్ధం జరిగే తీరు మారినా..చివరకు రక్తపాతంతో ముగుస్తోందనే డైలాగ్ ఇంప్రెస్ చేయగా.. అధర్మంతో అయినా ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధమంటూ కథానాయకుడు చెప్పిన డైలాగ్ ఈ ఆడియో గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. రీసెంట్ గా షూట్ స్టార్ట్ అయిన "తల్వార్" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు - ఆకాష్ జగన్నాథ్, ప్రకాష్ రాజ్, పూరి జగన్నాథ్, షిన్ టామ్ చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్, తదితరులు