Webdunia - Bharat's app for daily news and videos

Install App

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

సెల్వి
గురువారం, 12 జూన్ 2025 (16:44 IST)
Avika Gor
టీవీలో సూపర్ హిట్ సీరియల్ బాలికా వధు నటి అవికా గోర్ తన చిరకాల ప్రియుడు మిలింద్ చంద్వానీతో బుధవారం, జూన్ 11, 2025న నిశ్చితార్థం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మిలింద్‌తో గత కొన్ని సంవత్సరాలుగా అవికా గోర్ సంబంధంలో ఉంది. ఈ జంట తమ నిశ్చితార్థ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
ఇక అవికా గోర్ కాబోయే భర్త మిలింద్ చాంద్వానీ ఐఐఎం గ్రాడ్యుయేట్ కావడం గమనార్హం. మిలింద్ మార్చి 27, 1991న హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో జన్మించాడు. భోపాల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బిఇ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఐఐఎం అహ్మదాబాద్ (ఐఐఎంఏ) నుండి ఎంబీఏ డిగ్రీ పొందాడు. 
 
తన విద్యను పూర్తి చేసిన తర్వాత, మిలింద్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఈ వృత్తిని విడిచిపెట్టి, సామాజిక సేవపై తన ఆసక్తిని కొనసాగించాడు.
Avika Gor
 
2019లో, మిలింద్ ఎంటీవీ ప్రసిద్ధ రియాలిటీ షో 'రోడీస్ రియల్ హీరోస్'లో పాల్గొన్నాడు. అక్కడ అతను తన నిజాయితీ, నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక సేవ పట్ల అంకితభావంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మిలింద్ తన జీవితంలో 30 కిలోల బరువు తగ్గాడు. ఇది అతని ఆత్మవిశ్వాసం, అంకితభావానికి సంకేతం. దీనితో పాటు, అతను ఫ్యాషన్ షోలలో కూడా మోడలింగ్ చేశాడు.
 
అవికా హైదరాబాద్‌లో మిలింద్‌ను కలిశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తొలుత తాము మంచి స్నేహితులుగా వున్నామని.. ఆపై ప్రేమలో పడ్డామని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments