Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Advertiesment
kalpika ganesh

ఠాగూర్

, గురువారం, 12 జూన్ 2025 (14:04 IST)
సినీ నటి కల్పిక గణశ్‌పై హైదరాబాద్, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిజం క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు. గత నెల 29వ తేదీన క్లబ్‌కు వెళ్లిన కల్పిక గణేశ్... రూ.2,200 బిల్ చేసి కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వాలని కోరగా, కుదరదని మేనేజర్ చెప్పడంతో గొడవకు దిగిందని, క్లబ్ యజమాని తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
కాగా, మేనేజర్ ఇతర సిబ్బంది తనపై అత్యాచారం, అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో నటి తప్పుడు ప్రచారం చేశారని యజమాని తెలిపారు. పోలీసుల ముందు కూడా అసత్య ఆరోపణలు చేశారని, క్లబ్‌లోని సామాగ్రిని ధ్వంసం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి