Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Advertiesment
Astrology

రామన్

, బుధవారం, 11 జూన్ 2025 (04:00 IST)
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అనుమానాలకు తావివ్వవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు. ఆరోగ్యం జాగ్రత్త. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. ఆప్తులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ శ్రమ ఫలిస్తుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేయగల్గుతారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పరిచయస్తులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాలు పట్టించుకోవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధనసహాయం తగదు. పత్రాల రెన్యువ‌ల్‌ను అశ్రద్ధ చేయంకండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆటంకాలెదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తిచస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. భేషజాలకు పోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అభిష్టం సిద్ధిస్తుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అనవసర జోక్యం తగదు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అవకాశాలను దక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనుకున్న పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో శ్రమించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. పరిచయస్తులకు ధనసహాయం అర్ధిస్తారు. దంపతుల మధ్య ఆకారణ కలహం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?