Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Advertiesment
Astrology

రామన్

, శనివారం, 7 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యులు కార్యోన్ముఖులను చేస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. పెట్టుబడులు కలిసిరావు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆచితూచి అడుగేయండి. మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో శ్రమిస్తారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు అధికం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆప్తుల వ్యాఖ్యలు మనోధైర్యం కలిగిస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పొదుపు ధనం అందుకుంటారు. దంపతుల ఏకాభిప్రాయం నెలకొంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. అనవసర జోక్యం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్తయత్నానికి శ్రీకారం చుడతారు. పెద్దల ఆశీస్సులందుకుంటారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. ఆశించిన ఫలితం సాధిస్తారు. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్తపనులు మొదలెడతారు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం మందగిస్తుంది. వాహనదారుకు డూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అభిష్టం నెరవేరుతుంది. అనుకున్నది సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నోటీసులు అందుకుంటారు. పెద్దలను సంప్రదిస్తారు. ఆచితూచి అడుగేయండి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?