Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అశిష్ గాంధీ

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (18:29 IST)
Ashish Gandhi
'నాటకం' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశిష్ గాంధీ. రగ్డ్ లుక్ లో కనిపించి తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది. 'నాటకం' చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వం వహించడం విశేషం. 'నాటకం' సినిమా తో తన ప్రతిభను చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ.

విజన్ సినిమాస్ పతాకంపై తె‌రకెక్కుతున్న ఈ సినిమా ని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పుని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్ కి వెళ్లబోతుంది. మొత్తంగా ఈ సినిమా లో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా  తాజాగా పోలీస్ పాత్ర కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది..  
 
ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments