Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ ఉద్యోగుల ఒడిదొడుకుల కథే అర్థమైందా అరుణ్ కుమార్

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (16:31 IST)
Priyadarshi and others
అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ రూపొందింది. హ‌ర్షిత్ రెడ్డి, అన‌న్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌డివాడ త‌దిత‌రులు త‌మ‌దైన న‌ట‌న‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. ‘అఫిషియల్ చౌక్యాగిరి’ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. దీని కార‌ణంగా ఈ కార్పొరేట్ డ్రామాలో ఓ కొత్త అనుభూతి క‌లుగుతుంది. 
 
*ట్రైలర్ లాంచ్ ముఖ్య అతిథి, యాక్టర్ ప్రియదర్శి*, మాట్లాడుతూ ‘‘ఆహాలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం చాలా ఆనందంగా ఉంది. ఇదొక వైవిధ్య‌మైన క‌థాంశం. బ‌య‌ట‌కు ఎంతో అందంగా క‌నిపించే కార్పొరేట్ ప్ర‌పంచం ఎలా ఉంటుంది.  ఎదో సాధించాల‌నే ల‌క్ష్యంతో ఎంతో మంది యువ‌కులు ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగు పెడ‌తారు. అయితే వారికి ఎదుర‌య్యే స‌వాళ్లు.. వాటిని ఎలా అధిగ‌మించాల‌నే విష‌యాల‌ను ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. త‌ప్ప‌కుండా వెబ్ సిరీస్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతుంది” అన్నారు.
 
ఆహా కంటెంట్, నాన్ స‌బ్స్ రెవెన్యూ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ ‘‘కార్పొరేట్ ప్రపంచంలో  ఉండే ఇబ్బందుల‌ను ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాం. అరుణ్ కుమార్ అనే యువ‌కుడు త‌న జీవితంలో ఏదో సాధించాల‌నే ల‌క్ష్యంతో సిటీలోని కార్పొరేట్ కంపెనీలోకి ఇంట‌ర్న్ ఎంప్లాయ్‌గా జాయిన్ అవుతారు. త‌న ప్ర‌యాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల‌ను, సాధించిన ఉన్న‌తి  అన్నింటినీ ఇందులో చూపిస్తున్నాం. ప్ర‌స్తుతం ఉన్న కార్పొరేట్ ప్ర‌పంచంలోని ఉద్యోగులంద‌రూ ఈ క‌థ‌కు క‌నెక్ట్ అవుతారు. అంతే కాకుండా వారిని వారి ల‌క్ష్యం వైపు అడుగులు వేసేలా ఈ ఒరిజిన‌ల్ ప్రేరేపిస్తుంది’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులతో మందేసింది.. తలనొప్పిగా వుందని వెళ్లి ఉరేసుకుంది..

గర్భిణి స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం!

గణేష నిమజ్జనం అంటే ఇలా జరగాలి.. వీడియో వైరల్

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

ఎంత గింజుకున్నా... సీఎం రేవంత్ రెడ్డి నా స్థాయికి రాలేరు : హరీశ్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments