Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లిరికల్ సాంగ్ రంగమ్మ

Chaitanya Rao,  Prince Henry, Priyadarshi
, గురువారం, 6 ఏప్రియల్ 2023 (18:41 IST)
Chaitanya Rao, Prince Henry, Priyadarshi
పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని తర్వాత బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను నటుడు ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేశారు.

శ్రీనివాస మౌళి రాసిన ఈ గీతాన్ని ఎస్పీ చరణ్ ఆలపించాడు. కథా నేపథ్యాన్ని బట్టి 80ల నాటి రెట్రో మ్యూజిక్ ను గుర్తు చేసేలా కంపోజింగ్, ట్యూన్ కనిపిస్తున్నాయి. ఆ కాలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గుర్తుకు తెచ్చేలా చరణ్ అద్భుతంగా పాడారు ఈ గీతాన్ని. ‘కంటిచూపు నిన్నే దాటి పోనంటోందమ్మా.. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ.. మంటే పెట్టావమ్మా.. మందేపూశావమ్మా.. గుండె కాజేసి జెడ గంటె కట్టావమ్మా.. రంగమ్మా’ అంటూ ఈ లిరిక్స్ కాస్త ఫన్నీగా ఉన్నా.. రెట్రో స్టైల్ పిక్చరైజేషన్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంది.
 
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఈ పాట నా చేతుల మీదుగా విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ పాట చాలా బావుంది. అంతకంటే ఈ సినిమా టీమ్ అందరితో పదేళ్లుగా పరిచయం ఉంది. చైతన్య, నేను ఒకేసారి స్టార్ట్ అయ్యాం. ఇలాంటి మంచి కథలు ఎంచుకుంటున్నందుకు చైతన్యకు ఆల్ ద బెస్ట్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇచ్చట మంచి ఫోటోలే కాదు.. మంచి సినిమాలు కూడా తీయబడతాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.
 
హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. రంగమ్మ పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్. ప్రిన్స్ హెన్రీ ట్యూన్ ఇచ్చినప్పటి నుంచి చాలామంది ఈ పాటతో ప్రేమలో పడిపోయాం. ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా కంపోజింగ్, లిరక్స్ అన్నీ క్యాచీగా ఉన్నాయి. మీ అందరికీ కూడా ఈ పాట నచ్చుతుందనుకుంటున్నాను. బిగ్ బెన్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ను మరింత పెచుతూ.. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం.. ’అన్నారు.
 
సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ మాట్లాడుతూ.. ‘ఈ పాటను విడుదల చేయడానికి వచ్చిన ప్రియదర్శికి థ్యాంక్స్ యూ సో మచ్. దర్శకుడి టేస్ట్ కు తగ్గట్టుగా.. సినిమా నేపథ్యానికి అనుగుణంగా ఈ పాటను రెట్రో స్టైల్ ను గుర్తు చేస్తూ కంపోజ్ చేయడం జరిగింది. ఈ ట్యూన్ విన్న తర్వాత సింగర్ ఎస్పీ చరణ్ గారు మెచ్చుకోవడం మర్చిపోలేను. మీకు ఈ పాట నచ్చుతుందని ఆశిస్తున్నాను.. ’అన్నారు.
 
లిరిసిస్ట్ శ్రీనివాస మౌళి మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో నుంచి రంగమ్మా అనే పాటను నేను రాశాను. ఈ పాట రాస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్రిన్స్ హెన్రీ మంచి కంపోజింగ్ చేశారు. దర్శకుడు చెందు దగ్గరుండి మరీ ఈ పాట రాయించుకున్నారు. ఈ పాటకు సంబంధించి నాకు మరో స్పెషల్ ఎస్పీ చరణ్ గారు పాడటం. ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ.. థ్యాంక్యూ.. ’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావణాసురలో ఛాలెజింగ్ రోల్ చేశా : మేఘా ఆకాష్