Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాకీ పూర్తి చేసుకుని ప్రీ-టీజర్ కు సిద్దమైన అర్జున్ S/O వైజయంతి

దేవీ
బుధవారం, 12 మార్చి 2025 (16:12 IST)
Nandamuri Kalyan Ram
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.
 
ఫస్ట్ లుక్ పోస్టర్‌తో గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రీ-టీజర్‌ను  మార్చి14న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ మోడరన్ అవతార్‌లో కనిపించారు.  ఫ్రెంచ్ గడ్డం, షేడ్స్‌తో, భారీ మైనింగ్ ల్యాండ్‌స్కేప్ లో డైనమిక్ గా వాక్ చేస్తూ రావడం అదిరిపోయింది. ఈ ప్రీ-టీజర్ లో అఫీషియల్ టీజర్ విడుదల తేదీని కూడా రివిల్ చేస్తోంది.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా అందించారు.
 
సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మిగిలిన పార్ట్‌లు పూర్తయ్యాక, రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.
 
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments