Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరో ప్రేమలో ముదురు హీరోయిన్‌ ... బోరున విలపిస్తున్న తండ్రి

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈమె బాలీవుడ్‌లో చిన్నచిన్న వేషాలు వేస్తూ చివరకు పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని ఇద్దర

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:52 IST)
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈమె బాలీవుడ్‌లో చిన్నచిన్న వేషాలు వేస్తూ చివరకు పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లయింది. కొన్నాళ్లకు అతనికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది.
 
ప్రస్తుతం ఆమె వయసు 45 యేళ్లు. ఈ వయసులోనూ తన గ్లామర్ షోతో దూసుకుపోతుంది. తన విడాకుల అనంతరం బాలీవుడ్ కుర్ర హీరో అర్జున్ కపూర్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు బాలీవుడ్ ప్రపంచంలో విరివిగా వినిపిస్తున్నాయి. 
 
బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కూడా తన కొడుకు పెళ్ళైన అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని బాధపడుతున్నాడట. ఈ విషయం తెలిసిన సల్మాన్ ఖాన్ ఓ ఫంక్షన్‌లో బోనీకపూర్‌ని ప్రేమగా దగ్గర తీసుకొని అర్జున్ కపూర్‌ని కాస్త కట్టడి చేయండి అంటూ హితవు పలికినట్టు సమాచారం. 
 
అయితే, తాజాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ కలిసి ఓ ఫ్యాషన్ షోలో పక్కపక్కనే కూర్చొని షోని ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో మరోసారి ఈ ప్రచారం ఎక్కువైంది. ఈ ఫ్యాషన్ షోకి అర్జున్ కపూర్ తన చెల్లెల్లు జాన్వీ, ఖుషీ కపూర్‌లను వెంటబెట్టుకొని వచ్చారు. 
 
అందరూ స్నేహపూర్వక వాతావరణంలోనే ఉన్నారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నప్పటికీ గతం నుంచి మలైకా, అర్జున్‌ల ప్రేమ వ్యవహారం ప్రచారం ఉండడంతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments