Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ : స‌రోజా దేవి పాత్ర కోసం అనుష్క‌

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (11:55 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' అనే పేర్లతో ఈ చిత్రం రానుంది. 
 
ఈ చిత్రంలో తొలి భాగం జనవరి 9వ తేదీన, రెండో భాగం జనవరి 24వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌కి అమితానందాన్ని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ సినిమాలోని ముఖ్య పాత్ర‌ల కోసం పలువురు స్టార్స్‌ని ఎంపిక చేసిన చిత్ర బృందం అనుష్క శెట్టిని కూడా కీల‌క పాత్ర కోసం ఎంపిక చేశారట. 
 
ఎన్టీఆర్ సరసన బి.సరోజాదేవి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ చిత్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ బయోపిక్‌లో చూపిస్తున్నారట. ఈ క్ర‌మంలో స‌రోజా దేవి పాత్ర కోసం అనుష్క‌ని తీసుకున్నార‌ట‌. అతి త్వ‌ర‌లో ఈ విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించ‌నున్నార‌ని అంటున్నారు. 
 
అనుష్క చివ‌రిగా 'భాగ‌మ‌తి' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఆ మూవీ త‌ర్వాత ఏ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డం విశేషం. మ‌రి ఎన్టీఆర్‌తో అనుష్క ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

నా తోట సరే... పక్కనే చంద్రబాబు తోట కూడా వుందిగా, దాని సంగతేంటి? పెద్దిరెడ్డి జస్ట్ ఆస్కింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments