Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా తండ్రి ఎన్టీఆర్‌ని ఎలాపడితే అలా చూపిస్తే ఒప్పుకోను: పురంధరేశ్వరి

Advertiesment
నా తండ్రి ఎన్టీఆర్‌ని ఎలాపడితే అలా చూపిస్తే ఒప్పుకోను: పురంధరేశ్వరి
, బుధవారం, 31 అక్టోబరు 2018 (21:47 IST)
ఎపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్రమాజీ మంత్రి పురందరేశ్వరి. జగన్ పైన జరిగిన దాడిని ఖండించారామె. జగన్ శరీరంలో కత్తి అంగుళం దిగిందా, అర అంగుళం దిగిందా, అంగుళన్నర దిగిందా అని రాష్ట్రప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణలపై దాడి జరిగిందంటే శాంతిభద్రతలు ఎంతమాత్రమో ప్రజలు అర్థం చేసుకోగలరని, ఎపిలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయన్నారు. 
 
శ్రీనివాసరావు మంచి వ్యక్తని ఎపి పోలీసులే సర్టిఫికెట్ ఇచ్చారని, జగన్ పైన దాడికి పాల్పడిన వ్యక్తికి నేరచరిత్ర ఉందనేది స్పష్టంగా తెలుస్తోందని, దాడిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలే తప్ప, కేంద్రం ఎందుకు విచారణ జరిపించాలని ప్రశ్నించారు. ఎపిలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, దేశం సర్వతోముఖాభివృద్థి సాధించే దిశగా మోడీ ముందుకు తీసుకెళుతున్నారని, పరిపూర్ణానందస్వామి ఇష్టపడే బిజెపిలో చేరారన్నారు. 
 
ఎమ్మెల్యే, ఎంపిగా పరిపూర్ణానందస్వామి పోటీ చేయరని, భావసారూప్యత లేని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయని, బిజెపిని ఓడించడం - మోడీని గద్దెదించడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. 
ప్రజల్లో మోడీపై బలమైన నమ్మకం ఉందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పైన ఎవరుపడితే వారు చిత్రాలు చేస్తున్నారనీ, నిజ జీవితాన్ని వక్రీకరించి తీస్తే మటుకు ఒప్పుకోమని చెప్పారు పురంధేశ్వరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడి కత్తి దాడి: జగన్‌ని ఫోన్లో పరామర్శిద్దామనుకున్నా... కానీ: బాబు