Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తిన అనుపమ పరమేశ్వరన్..

Webdunia
గురువారం, 30 మే 2019 (19:20 IST)
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తింది. ఏదో సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం అనుకుంటే పొరపాటే. ఈ అమ్మడు అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తింది రీల్ లైఫ్‌లో కాదు, రియల్ లైఫ్‌లోనే.  
 
నిజమండీ బాబూ. మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాకి అనుపమ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా షంజూ జేబా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా సెట్‌లోని పిక్స్‌ను అనుపమ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
'ఇది న్యూ బిగినింగ్, షంజూ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేయడం హ్యాపీగా ఉంది, ఈ న్యూ రోల్ పట్ల ఎగ్జైటెడ్‌గా, ఆనందంగా మరియు కొంత నెర్వస్‌గా ఉంది. ఈ టీమ్ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాను, మా సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలి'.. అంటూ ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసింది. 
 
మరి అసిస్టెంట్‌గా సినిమాలు చేసి, అనుభవం సంపాదించాక డైరెక్షన్ చేస్తుందా లేక హీరోయిన్‌గా కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి. కాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో అనుపమ నటించిన రాక్షసుడు త్వరలో రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments