Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ ఖాన్ ల‌గాన్ టీమ్‌తో మ‌రో ప్ర‌యోగం

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (13:55 IST)
Lagan team
అమీర్‌ఖాన్ న‌టించిన సినిమా `ల‌గాన్‌`. 2001లో ఆయ‌నే నిర్మించి విడుద‌ల చేశారు. అంద‌రూ చిన్న చిన్న న‌టీన‌టుల‌తో ఈ సినిమా తెర‌కెక్కించారు. అశుతోష్ గోవారికర్ రచన, దర్శకత్వం వహించారు. బ్రిటీష్ పాల‌కులు గ్రామాల‌కు ప‌న్నులు వేసి ఏవిధంగా పీడించారో తెలియ‌జెప్పే క‌థాంశం. ఇది అప్ప‌ట్లో ఇండియాలో ప్ర‌తి గ్రామంలోని ప‌రిస్థితి అలాంటిది. వారికి ఎదురుతిరిగి మాట్లాడితే శిక్ష క‌ఠినంగా వుంటుంది. అలాంటిది ఓ మారుమూల గ్రామంలో వుండే అమీర్‌ఖాన్ త‌న ఊరి జ‌నంతో క‌లిసి తెల్ల‌దొర‌ల క్రీడ క్రికెట్‌ను ఆడి ఏవిధంగా త‌మ‌ను తాము ర‌క్షించుకున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. 
 
ఆ సినిమాలో గ్రేసీసింగ్‌,  బ్రిటిష్ నటులు రాచెల్ షెల్లీ, పాల్ బ్లాక్‌తోర్న్ న‌టించారు. కానీ ల‌గాన్ విడుద‌లై 20 ఏళ్ళు అయిన సంద‌ర్భంగా అమీర్‌ఖాన్ కు జూన్ 15న అభినంద‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న భావాల‌ను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ మాయా ప్ర‌పంచంలో నాతో ప్ర‌యాణ‌మైన ఎంతో మంది సీనియ‌ర్ల‌కు, సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఈ సినిమా పంపిణీచేసిన వారికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు ఏమి చెప్పినా త‌క్కువే అంటూ వెలిబుచ్చారు. 
 
అయితే ఈ సంద‌ర్భంగా ల‌గాన్ టీమ్‌తోనే నెట్‌ఫ్లిక్స్ ఓ ప్ర‌యోగం చేయ‌బోతున్న‌ట్లు చిన్న వీడియోను విడుద‌ల చేసంది. వ‌ర్షాలు ప‌డ‌క ఎండుబారిన గ్రామంలో ఓ మూగ‌వాడు డ‌ప్పువాయిస్తూ అరుస్తుండ‌గా అంద‌రూ అక్క‌డికి చేరుకుంటారు. అత‌ను ఆకాశం వైపు చూపిస్తాడు. క‌మ్ముకున్న మేఘాలు గ్రామం వైపు వ‌స్తుంటాయి. ఇది ఆస‌క్తిగా అమీర్‌ఖాన్ బృందం చూస్తుండ‌గా ఆకాశంలోనే `క‌మింగ్ సూన్‌. చ‌లే చ‌లోల‌గాన్‌. ఒన్స్ అపాన్ ఏ టైమ్ అండ్ ఇంపాజిబుల్ డ్రీమ్` అంటూ పేరు ప‌డుతుంది. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌జేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments