సినిమాలో ఏదైనా కొత్తదనం వుంటేనే ప్రేక్షకులు థియేటర్‌కు రావడంలేదు. ఇప్పుడు కరోనా తర్వాత దాదాపు అగ్ర హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలుగా మారిపోయాయి. అలాంటి రేసులో తాను ఎందుకు వుండకూడదనుకున్నాడో ఏమో కానీ పూరి జగన్నాథ్ కూడా చేరేలా వున్నాడు. పూరీ దర్శకత్వంలో చార్మి, కరన్‌జోహార్ కలయికలో `లైగర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం తెలిసింది. చిత్ర యూనిట్ ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే బాక్సర్‌పై పలు సినిమాలు కూడా వచ్చాయి. రవితేజ `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`లోకూడా పూరీ జగన్నాథే దర్శకుడు. అందులో బాక్సింగ్ అంటే ఇష్టముండని రవితేజకు, అసలు తండ్రంటే చికాకు వున్న రవితేజ చివరికి ప్రకాష్‌రాజ్ కోరిక మేరకు బాక్సర్‌గా ట్రైనింగ్ తీసుకుని సినిమాను రక్తికట్టించాడు.
ఇప్పుడు మరలా పూరీనే బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఏదో కొత్త అంశం వుండాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి కరన్‌జోహార్ సపోర్ట్ కూడా వుండడంతో బాక్సర్‌గా అసలైన వాడిగా పేరుపొందిన మైక్‌టైసన్‌ను తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో విజయ్‌కు గురువుగా నటిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ అంతర్జాతీయ బాక్సర్ నటించాలని అందుకే ప్రస్తుతం ఆ పాత్ర కోసం అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే సినిమాకు మరింత క్రేజ్ రానుంది.