Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షారుఖ్ ఖాన్ లా మెరిసిన‌ విజయ్ దేవరకొండ

Advertiesment
షారుఖ్ ఖాన్ లా మెరిసిన‌ విజయ్ దేవరకొండ
, సోమవారం, 14 జూన్ 2021 (18:20 IST)
Vijay Devarakonda
విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.యూత్ లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ  న్యూస్ లో నిలిచాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ ల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో కనిపించాడు.సౌత్ ఇండియా నుండి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. చేసిన 9 సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టా గ్రామ్ లైవ్ ముచ్చటించాడు డబూ.
 
webdunia
Vijay Devarakonda, Dabu Ratnani
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఈ ఫొటో షూట్ చాలా తొందరగా, చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు.నేను షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో చూసా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటినుండి నాకు మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని.ఫైనల్ గా నా కోరిక తీరింది.
 
డబూ రత్నాని మాట్లాడుతూ : థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో డెబ్యూ చేసినందుకు.మీరు చాలా కూల్ పర్సన్.ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేసాను.నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే.థాంక్యూ.’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని సమర్పణలో `మీట్ క్యూట్` ప్రారంభం