Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని సమర్పణలో `మీట్ క్యూట్` ప్రారంభం

Advertiesment
Meet Cute Launch
, సోమవారం, 14 జూన్ 2021 (17:32 IST)
Nani, sathya raj
త‌న నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్ సినిమా ప‌తాకంపై సూపర్‌హిట్‌ ఫిల్మ్స్‌ను ప్రేక్షకులకు అందించిన న్యాచులర్‌ స్టార్‌ నాని తాజాగా మరో మంచి సినిమాతో మ‌న ముందుకు రాబోతున్నారు. ‘మీట్‌ క్యూట్` టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్‌ పోస్టర్ సినిమా ప‌తాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. నటుడు సత్యరాజ్ పై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్‌ కొట్టారు.
 
వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌ నుంచి ఇప్పటికే ‘అ!’, ‘హిట్‌’ వంటి కంటెంట్‌ ఉన్న సక్సెస్‌పుల్‌ సినిమాలు వచ్చి స‌క్సెస్ సాధించిన తరుణంలో ‘మీట్‌ క్యూట్` కూడా అలాంటి కంటెంట్‌ డ్రివెన్‌ సినిమాగా రూపొందుతోంది. అలాగే ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’ పతాకం ద్వారా ప్రశాంత్‌ వర్మ, శైలేష్‌ కొలను వంటి ప్రతిభావంతులైన దర్శకులు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తాజాగా `మీట్ క్యూట్` సినిమాతో దీప్తి ఘంట అనే నూత‌న దర్శకురాలు పరిచయం అవుతోంది.
 
‘‘వాల్‌పోస్టర్స్‌ సినిమాలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 4గా ‘మీట్‌ క్యూట్’ ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా ఈ కొత్త ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది’’ అని ట్వీట్‌ చేశారు నేచుర‌ల్ స్టార్ నాని. 
 
క్రేజీ మల్టీస్టారర్‌ మూవీగా రూపొందుతున్న‘మీట్‌ క్యూట్’లో కొంత మంది ప్రముఖ హీరోయిన్స్ ప్రధాన పాత్రలలో నటించనున్నారు. 
 
వసంతకుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందిస్తున్నారు. అవినాష్‌ కొల్ల ఆర్ట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలను స్వీకరించారు. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రయూనిట్‌ అతి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.
 
సాంకేతిక వర్గం: 
సమర్పణ: నాని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన, దర్శకత్వం: దీప్తి ఘంట
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
డి ఓ పి: వసంత్ కుమార్
సంగీతం: విజయ్ బుల్గనిన్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: గ్యారీ బీహెచ్
లిరిక్స్: కేకే 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీలైనంత సహాయం చేస్తున్నా, కానీ అర్థరాత్రి ఇబ్బంది పెడుతున్నారు: సోనూసూద్