ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతుంది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి.
పెంచిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. ఈ జూన్ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 23 సార్లు చమురు ధరలు పెరిగాయి. మే 4 నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.5.81, డీజిల్ ధర రూ.6.12 పెరిగింది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి. మరొకొన్ని చోట్ల సెంచరీకి చేరువగా ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106 పలుకుతోంది.
తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.85కు పెరిగింది. డీజిల్ రూ.86.75కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.61, డీజిల్ రూ.94.56, ముంబైలో పెట్రోల్ రూ.101.04, డీజిల్ రూ.94.15గా ఉన్నాయి.