Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌లో అనసూయ.. లాక్ డౌన్ తర్వాత రియాల్టీ షో ప్రారంభం? (video)

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (12:00 IST)
కరోనా నేపథ్యంలో సినీ షూటింగ్‌లు ఆగిపోయాయి. అయితే బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలు మాత్రం జరుగుతాయని ప్రచారం సాగుతోంది. అయితే బిగ్ బాస్ వంటి షోలు ఇప్పుడే జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ తరువాత నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం 
బిగ్‌బిస్ టీమ్ ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం వేట మొదలు పెట్టిందని సమాచారం. ఈ క్రమంలో పలువురితో సంప్రదింపులు జరిపిందని తెలుస్తోంది.
 
ఇందులో భాగంగానే అందం, అభినయాన్ని సొంతం చేసుకున్న అనసూయను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే యాంకర్ గానే కాకుంగా నటిగా మంచి గర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బిస్ మొదటి సీజన్ నుంచి ఆమె బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రానుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నాలుగో సీజన్ కోసం నిర్వాహకులు ఆమెను సంప్రదించారట.
 
ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్ 3 కోసం యాంకర్ శ్రీముఖికి భారీ పారితోషికం ఇచ్చారట. ఆమెకు ఒక్కో ఎపిసోడ్‌కు లక్ష రూపాయల వరకు ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఈ లెక్కన అనసూయను హౌజ్ లోకి తీసుకువచ్చేందుకు చాలా పెద్ద మొత్తాన్నే ఆఫర్ చేశారట. అయినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. ఈ ఆఫర్‌ను అనసూయ సున్నితంగా తిరస్కరించిందని టాక్ వస్తోంది. 
 
తనకు ఆసక్తి లేదని.. ఫ్యామిలీని వదిలి అన్ని రోజులు దూరంగా వుండలేనని చెప్పుకొచ్చిందట. మరోవైపు అనసూయ యాంకరింగ్, సినీ అవకాశాలతో పుల్ బిజీగా ఉంది. అలాగే బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండవ సీజన్‌కు నాని, మూడవ సీజన్‌కు నాగార్జున హోస్టులు వ్యవహరించారు. మరీ నాలుగో సీజన్ కు హోస్టుగా ఎవరు చేయనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments