Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అరవింద్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

Webdunia
గురువారం, 14 మే 2020 (22:17 IST)
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఇటీవల డిజిటిల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆహా అనే సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థను సక్సెస్ చేయడం కోసం పక్కా ప్లాన్ రెడీ చేసారు. మెగాస్టార్ చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. స్ర్కిప్ట్ రెడీ చేసారు. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే... చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనతో సినిమా తీయాలని అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు కానీ.. ఇప్పటివరకు చిరు డేట్స్ ఇవ్వలేదు. 
 
అయితే.. వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కరోనా వలన షూటింగ్స్‌కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగారని వార్తలు వస్తున్నాయి. 
 
చాలా తక్కువమందితో చాలా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తామని చెప్పారట. అయినప్పటికీ... ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను మే 29 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అందుచేత మే 29 వరకు షూటింగ్స్ స్టార్ట్ అయ్యే ప్రసక్తే లేదన్నారని సమాచారం. చిరంజీవితో వెబ్ సిరీస్ చేయడం ద్వారా ఆహా సంస్థను సక్సస్ చేయచ్చు అనే ప్లాన్లో ఉన్నారు.
 
దీంతో చిరు నిజంగానే వెబ్ సిరీస్ చేయడానికి ఓకే చెప్పారా..? ఒకవేళ చేస్తే.. కథ ఏంటి..? అందులో చిరు పాత్ర ఎలా ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్న చిరంజీవి ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments