పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. కారణం ఏమింటంటే?

మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (12:56 IST)
జబర్దస్త్ యాంకర్, సినీ నటి అయిన అనసూయ పోలీసులను ఆశ్రయించింది. వేధింపులు తాళలేక ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో యాంకర్ అనసూయపై వేధింపులు ఎక్కువయ్యాయి. అనసూయ, భరద్వాజ్ ట్వీట్‌లపై నెటిజన్లు శృతిమించుతున్నారని పోలీసులు తెలిపారు. ఇంకా రంగంలోకి దిగిన పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. కొందరు చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు అనసూయకు మానసిక వ్యధను మిగిలుస్తున్నాయి. అంతేకాదు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. సదరు ఫిర్యాదుపై సైబర్ క్రైమ్స్ పీఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్ వారు సైతం స్పందించడం గమనార్హం.
 
తనపై చేసిన వ్యాఖ్యలకు తానేమి సిగ్గుపడటం లేదని, సరియైన వ్యవస్థలు చర్య తీసుకోవాలని పేర్కొంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఇంకా అనసూయ తనకు పోలీసుల నుంచి లభించిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేసింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎన్నాళ్లిలా? పెళ్లి చేస్కోండి దిల్ రాజు గారూ... అంటున్న సన్నిహితులు?