నాగశౌర్య సినిమా పునః ప్రారంభంతో ఆనంద హేళ‌

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (15:58 IST)
Usha, nagashowrya etc
క‌రోనా త‌ర్వాత ఆగిపోయిన సినిమాలు మ‌ర‌లా సెట్‌పైకి వెళ్ళ‌డంతో న‌టీన‌టులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పుడు నాగ‌శౌర్ కూడా ఆనందంతో త‌న మాతృమూర్తితో ఇలా క‌నిపించాడు. నాగశౌర్య, డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ తిరిగి మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
 
హీరో నాగశౌర్య, హీరోయిన్‌ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా లొకేషన్‌ పోస్టర్‌లో నాగశౌర్య, షీర్లే, అనీష్‌కృష్ణ, ఉషా ముల్పూరి ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని బట్టి సినిమా అవుట్ పుట్‌ అద్భుతంగా వస్తుందని తెలుస్తోంది.
 
శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ టైటిల్‌ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్‌ యాక్టర్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయగ్రాహకులు.
 
నటీనటులు: నాగశౌర్య, షీర్లే సేతియా, రాధిక, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదితరులు న‌టిస్తున్న ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌: ఉషా ముల్పూరి,  సమర్పణ: శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌,  మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌, డీఓపీ: సాయిశ్రీరామ్‌,  సహ నిర్మాత: బుజ్జి, ఎడిటర్‌: తమ్మిరాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments