Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనగనగా ఓ ప్రేమకథ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ హీరో రానా

విరాజ్. జె .అశ్విన్ హీరోగా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన టి.ప్రతాప్ ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అలాగే ఈ చిత్రానికి హీరోగా ప్రముఖ

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (18:28 IST)
విరాజ్. జె .అశ్విన్ హీరోగా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన టి.ప్రతాప్ ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అలాగే ఈ చిత్రానికి హీరోగా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్. కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్లుగా రిద్ధి కుమార్, రాధా బంగారు పరిచయమవుతున్నారు. 
 
ప్రముఖ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతా ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు. ఇటీవలే కేరాఫ్ కంచరపాలెం సినిమాను కూడా తన ప్రొడక్షన్లో నిర్మించగా.. ఆ సినిమాకు ఎంత మంచి పేరొచ్చిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేసి మరోసారి చిన్న సినిమాలపై తనకున్న నమ్మకాన్ని చూపించారు. ఇటీవలే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. 
 
ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్‌గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్‌ను స్థాపించి ఈ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానా తమ చిత్రం టీజర్‌ను విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.
 
దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ. రానా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ రానా నా ఈ తొలి చిత్రం టీజర్‌ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు: శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు: రామకృష్ణ నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు; కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments