Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కులాంతర వివాహం.. కాగ్ కార్యాలయంలో ఉద్యోగం.. అయినా చంపేశారు..

మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్య కలకలం రేపిన నేపథ్యంలో.. అలాంటి ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో తమ ఇంటి అమ్మాయిని పెళ్ల

Advertiesment
కులాంతర వివాహం.. కాగ్ కార్యాలయంలో ఉద్యోగం.. అయినా చంపేశారు..
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:23 IST)
మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్య కలకలం రేపిన నేపథ్యంలో.. అలాంటి ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో తమ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఇంటికి పిలిచి మరీ దారుణంగా హత్య చేశారు.


ఈ నెల 18న తన అత్తమామలను చూసేందుకు వచ్చి.. బావమరుదుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని మనోజ్ శర్మగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని 'కాగ్' కార్యాలయంలో డాటా ఆపరేటర్‌గా మనోజ్ శర్మ పనిచేస్తున్నాడు.
 
మనోజ్‌ శర్మ, సోనియాలు మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సోనియా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరిగింది. అయితే తమ గ్రామం రావాల్సిందిగా పలుమార్లు అత్తమామలు పట్టుబట్టడంతో మనోజ్ ఎట్టకేలకు కుత్బా గ్రామానికి వెళ్లాడు. భాగ్‌పట్ జిల్లాలోని గాంగ్‌నౌలి గ్రామంలో ఉన్న తన సొంతింటి నుంచి అతను బయలుదేరినప్పడు బావమరుదులు వెంటే ఉన్నారు.
 
అయితే మనోజ్ శర్మ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని బావమరుదులు, సోనియా కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసారు. మనోజ్ మృతదేహాన్ని చెరుకు తోటలో స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుక కోస్తావా... కోసెయ్.. నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా.. సీఐకు జేసీ ప్రతిసవాల్