Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్ .టి.ఆర్. బామర్ది నార్నే నితిన్ హీరోగా సినిమా

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:22 IST)
Clap by Allur aravind
అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌ నిర్మాత‌గా జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.9 సినిమా అన్న‌పూర్ణ గ్లాస్ హౌస్‌లో గురువారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీలో నార్నే నితిన్ హీరోగా న‌టిస్తున్నారు. ఇతను ఎన్ .టి.ఆర్. బామర్ది. వై.సి.ఫై. నేత నార్నె శ్రీనివాస్ కుమారుడు.  న‌య‌న్ సారిక కథానాయికగా పరిచయం అవుతుంది. 
 
ముహూర్త‌పు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర్ మారుతి స్క్రిప్ట్‌ను మేక‌ర్స్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 
 
అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందఉన్న ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వ‌ర్క్ చేయ‌బోతున్నారు. నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న రెండో సినిమా ఇది. న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. అంజిబాబు కంచిప‌ల్లి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 
 
కిర‌ణ్ కుమార్ మ‌న్నె ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి స‌మీర్ క‌ళ్యాణి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా రామ్ మిర్యాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments