Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాడీ షేమింగ్‌కు గురయ్యానా?.. పుకార్లు భలే సృష్టిస్తారండీ : కావ్యా కళ్యాణ్ రామ్

Advertiesment
kavya kalyan ram
, గురువారం, 13 జులై 2023 (08:44 IST)
బాడీ షేమింగ్ విషయంలో పలువురు దర్శకుల ధోరణి తనను ఇబ్బంది పెట్టిందంటూ తాను వ్యాఖ్యానించింగా వచ్చిన వ్యాఖ్యలపై హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కొట్టిపారేశారు. ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు తానెప్పుడూ చేయలేదని చెప్పింది. పైగా, పుకార్లు భలే సృష్టిస్తారండీ అంటూ కామెంట్స్ చేశారు. బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి', 'ఠాగూర్', 'అడవిరాముడు' మొదలైన చిత్రాల్లో నటించారు.
 
ఇటీవల హీరోయిన్‌గా 'మసూద' చిత్రంలో వెండితెరపై కనిపించింది. అయితే, ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ మూవీ కావంతో కావ్య పాత్ర గురించి ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన "బలగం" చిత్రం మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ఏకంగా వంద రోజుల పాటు ప్రదర్శించబడింది.
 
ఇకపోతే, బాడీ షేమింగ్ విషయంలో కొంతమంది దర్శకులు ధోరణి తనను చాలా బాధపెట్టిందని కావ్య ఒక ఇంటర్వూలో వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. తన విషయంలో ఏ దర్శకుడు కూడా ఎపుడూ అలా మాట్లాడలేదని చెప్పారు. అసలు ఆ విషయాన్ని గురించి తాను ఎక్కడా ప్రస్తావించలేదని కావ్య చెప్పుకొచ్చింది. ఇలాంటి అనవసరమైన ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జపాన్‌లో 14న విడుదల కానున్న కేజీఎఫ్ సిరీస్