Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని 30వ సినిమా తాజా అప్ డేట్- హాయ్ నాన్న అన్న మృణాల్ ఠాకూర్

Webdunia
గురువారం, 13 జులై 2023 (11:57 IST)
Nani, Hi Nanna, Mrinal Thakur
నేచురల్ స్టార్ నాని 30వ సినిమాకు హాయ్ నాన్న అనే పేరు ఖరారు చేసినట్లు కొద్దీ సేపటిక్రితమే మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్,  గ్లింప్స్‌   విడుదలచేశారు. ఇందులో ఓ టేబుల్ దగ్గర నిలుచొని ఎదో ఆలోచిస్తున్న నాని ని చూసి హాయ్ నాన్న అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది మృణాల్ ఠాకూర్. వెంటనే ఎదో.. ఎదో.. అంటూ బ్యాక్ డ్రాప్ సాంగ్ వస్తుంది.. వీరిని ఆశ్చర్యంగా నాని కుమార్తె చూస్తుంది... ఈ గ్లింప్స్‌ చూస్తేనే చైల్డ్ సెంటిమెంట్ సినిమా అని అర్ధమవుతుంది.
 
Nani, Hi Nanna, Mrinal Thakur
నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో భారీ స్థాయి తెరకెక్కుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని కొన్ని ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాని డిఫరెంట్ లుక్, క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక.
 
వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా  పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments