టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బన్నీ.. తాజాగా మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ ప్రపంచమే ఇన్‌స్టాగ్రామ్. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశాడు. ఇన్‌స్ట్ర
టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బన్నీ.. తాజాగా మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ ప్రపంచమే ఇన్‌స్టాగ్రామ్. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి కూడా తాను ఎంటర్ కాబోతున్నట్టు తెలిపాడు.
తన ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులకి చేరవేసేందుకు ఈ నెల 21 నుండి కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నట్టు బన్నీ పేర్కొన్నాడు. ప్రస్తుతం "నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా" అనే సినిమాతో బన్నీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
కాగా, ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులకి సినీ సెలబ్రిటీలకు మధ్య వారధిలా పని చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో సినిమా విషయాలనే కాక పర్సనల్ విషయాలను సినీ ప్రముఖులు ఎప్పటికపుడు ట్విట్టర్ లేదా ఫేస్ బుక్‌లలో వెల్లడిస్తున్నారు.