Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాలీవుడ్‌కు ధనుష్: ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌గా తెరంగేట్రం..

తమిళ నటుడైన ధ‌నుష్ మాత్రం త‌న మొద‌టి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌' చిత్రంలో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించి

Advertiesment
The Extraordinary Journey of the Fakir
, గురువారం, 2 నవంబరు 2017 (16:17 IST)
అందం అంతగా లేకపోయినా.. బక్క పలచగా వున్నా.. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కొలవెరి సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన కోలీవుడ్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే వంటి అగ్రతారలు హాలీవుడ్‌లో నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ తారలు అనిల్ క‌పూర్‌, అనుప‌మ్ ఖేర్‌, ఇర్ఫాన్ ఖాన్ వంటి న‌టులంద‌రూ హాలీవుడ్‌లో స‌హాయ పాత్ర‌ల్లో న‌టించారు.
 
అయితే తమిళ నటుడైన ధ‌నుష్ మాత్రం త‌న మొద‌టి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌' చిత్రంలో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ మంగ‌ళ‌వారం విడుద‌లైంది. తల్లి మృతి చెందాక తండ్రి కోసం వెతుకుతూ దేశాలు తిరిగే పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లు సమాచారం. 
 
రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌' పుస్త‌కం ఆధారంగా ద‌ర్శ‌కుడు కెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా భారత్, యూరప్, హాలీవుడ్‌లను ఏకం చేసే సినిమాగా ఇది నిలుస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెర్సల్: ఓవర్సీస్ కలెక్షన్స్ అదిరింది.. రూ.211 కోట్ల గ్రాస్.. కబాలికి తర్వాత?