Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెర్సల్: ఓవర్సీస్ కలెక్షన్స్ అదిరింది.. రూ.211 కోట్ల గ్రాస్.. కబాలికి తర్వాత?

కోలీవుడ్ హీరో విజయ్ నటించిన మెర్సల్ కొత్త రికార్డును సృష్టించింది. ఫ్రాన్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో తొలి స్థానంలో కబాలి, రెండో స్థానంలో బాహుబలి ఉండగా, మూడో స్థానంలో మెర్సల్ నిలిచ

Advertiesment
మెర్సల్: ఓవర్సీస్ కలెక్షన్స్ అదిరింది.. రూ.211 కోట్ల గ్రాస్.. కబాలికి తర్వాత?
, గురువారం, 2 నవంబరు 2017 (15:57 IST)
కోలీవుడ్ హీరో విజయ్ నటించిన మెర్సల్ కొత్త రికార్డును సృష్టించింది. ఫ్రాన్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో తొలి స్థానంలో కబాలి, రెండో స్థానంలో బాహుబలి ఉండగా, మూడో స్థానంలో మెర్సల్ నిలిచింది. దీపావళి సందర్భంగా విడుదలైన మెర్సల్ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

ఓ తమిళనాడులోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా వసూళ్లపరంగా దుమ్మురేపేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 139.52 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.211.44 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
 
12 రోజుల్లో ఓవర్సీస్‌లో ఈ సినిమా రూ.72కోట్లు వసూలు చేసింది. ఫ్రాన్స్, మలేషియాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబోతోంది. ఫ్రాన్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

ఫ్రాన్స్‌లో 10కే క్లబ్‌లో చేరిన ఈ సినిమా మలేషియాలో రూ.17కోట్లు రాబట్టింది. ఫ్రాన్స్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి తమిళ చిత్రంగా 'కబాలి' ఉండగా, రెండవ తమిళ చిత్రంగా 'మెర్సల్' నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో బాలీవుడ్ నటి