Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ... ఏం చెప్తారో?

విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీ వెళ్ళిన రేవంత్ ఏకంగా రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్థమైపోయాడు. అది కాస్త పెద్ద దుమారాన్నే రేపింది. కానీ రేవంత్ మాత్రం ఆ విషయాన్ని ఇంతవరకు

రేపు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ... ఏం చెప్తారో?
, శుక్రవారం, 27 అక్టోబరు 2017 (21:18 IST)
విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీ వెళ్ళిన రేవంత్ ఏకంగా రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్థమైపోయాడు. అది కాస్త పెద్ద దుమారాన్నే రేపింది. కానీ రేవంత్ మాత్రం ఆ విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. కానీ టి.టిడిపిలో మాత్రం ఆ విషయం కాస్త నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మొదటగా మోత్కుపల్లి రేవంత్ వ్యవహారంపై మండిపడగా ఆ తరువాత తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ ఏకంగా బాబుకు ఒక లేఖ రాశారు.
 
తన పర్యటన తరువాత నేరుగా వచ్చి కలిసి మాట్లాడుతానని చెప్పిన బాబు ఈరోజు తన విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చి టి.టిడిపి నేతలతో మాట్లాడారు. అందులోను టి.టిడిపి అధ్యక్షుడు రమణతో మాత్రమే బాబు మాట్లాడారు. జరిగిన విషయాలన్నింటిని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన వారెవరైనా ఉంటే వారు రేపు విజయవాడకు రావాలని వారితో ఒక్కొక్కరుగా పిలిచి మాట్లాడుతానని చెప్పారు బాబు. 
 
దీంతో రేవంత్ రెడ్డి రేపు విజయవాడకు వెళ్ళి లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును కలవనున్నారు. రేవంత్ వ్యవహారంపై ఇప్పటికే చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు వీరి భేటీ తరువాత బాబు ఎలాంటి ప్రకటన చేయనున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన తరపున వైజాగ్ ఎంపిగా త్రివిక్రమ్, రాజమండ్రి నుంచి అలీ..