వింత వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ కేథరిన్ థ్రెసా

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (17:25 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన హీరోయిన్లలో కేథరిన్ థ్రెసా ఒకరు. తన అందంతో పాటు అభినయంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. 'ఇద్దరు అమ్మాయిలతో..', 'సరైనోడు' వంటి చిత్రాల్లో నటించిన ఈ గ్లామరస్ బ్యూటీ... ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. 
 
అయితే, టాలీవుడ్‌ చాలా సినిమాలే చేసినా ఈ అందాల భామకు ఆశించిన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు చెబుతూ.. వింత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది ఈ అమ్మడు. ఈ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట. ఇంతకీ ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా.. అనోస్మియ. ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. ఎంత దుర్వాసన అయినా వారికి తెలియదు. వాసన చూసే శక్తి వారికి అస్సలు ఉండదు.
 
ఈ జబ్బు ఉన్న కారణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్‌కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వింత జబ్బు తన నటనకు ఎలాంటి అడ్డు రావడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments