Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక్ మాటలతో షాక్ అయిన బన్నీ ఫ్యాన్స్..!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (21:42 IST)
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ స‌రిలేరు నీకెవ్వ‌రు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌తో క‌లెక్ష‌న్ల ప్రభంజనం సృష్లించి నాన్ బాహుబలి 2 రికార్డ్‌ను సాధించింది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 29తో 50రోజులు పూర్తి చేసుకుంది.
 
ఈ సందర్భంగా హైద‌రాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్యఅథిలుగా హాజరయ్యారు. శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ అధినేత, చిత్ర సమర్పకులు దిల్‌రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, నిర్మాత, శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ శిరీష్, ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, శేఖర్ మాస్టర్, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పాల్గొన్నారు.
 
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తన స్పందనను తెలియచేస్తూ... సినిమా రంగం మీద ఎంతో  ప్యాషన్ ఉన్న అనీల్ సుంకర గారు, డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న దిల్ రాజు గారు, శిరీష్ గారు వీళ్లందరి సపోర్ట్‌తో ఇంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ తీశారు. సరిలేరు నీకెవ్వరు అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి అంటే అందరికన్నా నాకు ఎక్కువ ఇష్టం అని వినాయక్ అన్నారు. ఆయన ఇలాగే సూపర్ డూపర్ హిట్స్ తీస్తూ అందరిని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసిన ఎగ్జిబ్యూటర్స్‌ని, డిస్ట్రిబ్యూటర్స్‌ని ఇక్కడ చూస్తుంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌ని కలిసినంత సంతోషంగా ఉంది. 
 
మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్‌తో ఇంత తొందరగా సినిమా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయ‌డం.. అన్ని రికార్డులు బద్దలు కొట్టడం నిజంగా గొప్ప విషయం అన్నారు. సరిలేరు నీకెవ్వరు అన్నీ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది అని వినాయక్ చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారని టాక్ వినిపిస్తోంది. అదీ సంగతి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

యాంటీబయాటిక్స్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

సజ్జల భార్గవ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి: వైఎస్ షర్మిల

కొత్త మెనూని పరిచయం చేసిన హైదరాబాద్ బౌగెన్‌విల్లా రెస్టారెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments