#AlaVaikunthapurramulooOnNetflix చెప్పిందొకటి.. చేసేది మరొకటి..!

గురువారం, 27 ఫిబ్రవరి 2020 (15:06 IST)
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న ఈ సినిమా.. విడుదలైన 40రోజుల్లో దాదాపు 150 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఫలితంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది.  
 
కానీ ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ.. ఓ తీపికబురు వచ్చేసింది. అలవైకుంఠపురంలో సినిమాకి సన్ నెక్ట్స్ భారీ రేట్ ఇచ్చి మరీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లు కూడా ఈ సినిమాని దక్కించుకోవాలని ప్రయత్నించినా నిర్మాతలు మాత్రం సన్‌నెక్ట్స్‌కి అమ్మేశారు. అయితే సినిమాను 50 రోజులకు రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే జనవరి 12న ఈ సినిమా విడుదలవ్వడంతో 50 రోజులు అంటే సన్ నెక్ట్స్‌లో ఫిబ్రవరి 26న విడుదల అయ్యింది.
 
అయితే ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ అండ్ నెట్ ఫ్లిక్స్‌లో చూడలేరంటూ బన్నీ అండ్ టీమ్ అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ టైంలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

అందుకు కారణం సినిమా డిజిటల్ వెర్షన్‌ను 'సన్ నెక్స్ట్' యాప్‌కు అమ్మడమే అందుకు కారణమని పేర్కొన్నారు చిత్రబృందం. ప్రస్తుతం సన్ నెక్స్ట్ యాప్‌లో మాత్రమే కాక నెట్ ఫ్లిక్స్‌లోనూ విడుదలైంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రష్మిక మందన్న, ఫ్లాప్ సినిమా అయినా హిట్టవ్వాల్సిందే