Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ మూవీ ఫిక్స్... ఈసారి రీమేక్‌ని న‌మ్ముకున్నాడా..?

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (18:56 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో బాగా అప్సెట్ అయ్యాడు. ఇక నుంచి క‌థల విష‌యంలో చాలా కేర్ తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే చాలా క‌థ‌లు విన్నాడు కానీ.. ఏ క‌థ‌కు ఓకే చెప్ప‌లేదు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో సినిమా దాదాపు ఓకే అయ్యింద‌నుకున్నారు కానీ.. సెకండాఫ్ సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆగిపోయింది. దీంతో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తోనే బ‌న్నీ నెక్ట్స్ మూవీ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. 
 
ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా బ‌న్నీ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే.. ఈసారి త్రివిక్ర‌మ్ బ‌న్నీతో చేయ‌నున్న సినిమా కోసం హిందీ సినిమాని రీమేక్ చేయ‌నున్నార‌ని తెలిసింది. 
 
ఇంత‌కీ ఆ సినిమా ఏంటంటే... సోను కె టిటు కి స్వీటీ. ఇది ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైనర్. ఈ మూవీ మూల క‌థ‌ను తీసుకుని దానిని త్రివిక్ర‌మ్ స్టైల్లో మారుస్తున్నాడ‌ట‌. అయితే.. బ‌న్నీ తన సొంత నిర్మాణ సంస్థ‌లో ఈ సినిమా చేయాల‌నుకున్నాడు కానీ.. త్రివిక్ర‌మ్ ఎప్ప‌టిలాగానే హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌లో చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. దీనికి బ‌న్నీ కూడా ఓకే చెప్పాడ‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments