యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం అరవింద సమేత..వీర రాఘవ. ఇటీవల రిలీజైన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా విషయంలో కంప్లైంట్ ఏంటంటే.. ఇందులో కామెడీ తక్కువుగా ఉందనీ.. త్రివిక్రమ్ మార్క్ కామెడీ లేదని.
విజయదశమి సందర్భంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో యాంకర్ సరిగ్గా ఇదే ప్రశ్న అడిగింది. కామెడీ తక్కువుగా ఉంది అంటున్నారు. మీరేమంటారు ఈ కామెంట్ గురించి అని త్రివిక్రమ్‌ని అడిగితే... ఎన్టీఆర్ కలగచేసుకుని ఆయనపై కామెడీ డైరెక్టర్ అనే ముద్ర వేయకండి.
అయినా... తన క్యారెక్టర్ తండ్రిని కోల్పోయి బాధలో ఉన్నప్పుడు తను కామెడీ చేస్తే బాగోదు కదా. పాత్రకు తగ్గట్టుగా ఉంటుంది. ఇది ఎమోషనల్ ఫిల్మ్. దీనిని ఇలాగే తీయాలి అంటూ త్రివిక్రమ్ సమాధానం చెప్పకుండా ఎన్టీఆరే సమాధానం చెప్పేసాడు. అదీ.. సంగతి.