Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ పేరు నిలబెట్టారు... బాసిరెడ్డి బాడీ లాంగ్వేజ్‌కు వన్స్‌మోర్లు : త్రివిక్రమ్

Advertiesment
ఎన్టీఆర్ పేరు నిలబెట్టారు... బాసిరెడ్డి బాడీ లాంగ్వేజ్‌కు వన్స్‌మోర్లు : త్రివిక్రమ్
, సోమవారం, 15 అక్టోబరు 2018 (12:40 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రం విజయోత్సవ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య పేరు నిలబెట్టడమే కాదు, ఆ పేరును మ్యాచ్ చేసే సత్తా ఉన్న నటుడని ప్రశంసించారు.
 
ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి చిత్రం షూటింగ్ పూర్తయ్యేంత వరకు అన్నీ జూనియర్ ఎన్టీఆరేనని చెప్పారు. ఇలాంటి బలమైన నటుడు ఉండటం చాలా అరుదని చెప్పారు. పైగా, 'నన్ను నమ్మి ఈ సినిమా తీయండి.. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు' అని ఎన్టీఆర్ తనతో పదేపదే అనేవారని చెప్పారు. ఈ కారణంగానే ఈ చిత్ర విజయాన్ని ఆయన ఖాతాలో వేస్తున్నట్టు చెప్పారు. 
 
అదేసమయంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నవాళ్లు.. విలన్ జగపతిబాబు నటనకి వన్స్ మోర్లు చెబుతున్నారు. ఇంతవరకూ జగపతిబాబు చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో, ఈ సినిమాలోని బసిరెడ్డి అనే ఫ్యాక్షన్ లీడర్ పాత్ర ముందువరుసలో నిలుస్తుందన్నారు. 'బసిరెడ్డి'గా బాడీ లాంగ్వేజ్‌లోనూ.. డైలాగ్ డెలివరీలోనూ ఆయన చూపిన వైవిధ్యం అదుర్స్ అని చెబుతున్నారు. రాయలసీమ యాసలో జగపతిబాబు డైలాగ్స్ చెప్పినతీరు.. కొత్త లుక్‌తో పలికించిన హావభావాలు అద్భుతమని ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డూప్లికేట్ చంద్రబాబు ఎక్కడున్నారో.. ఆచూకీ తెలుపండి.. : వర్మ వినతి