Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నిజ‌మా.. న‌మ్మ‌లేక‌పోతున్నాను - అల్లు అర్జున్..!

Webdunia
బుధవారం, 8 మే 2019 (19:55 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన తొలి చిత్రం ఆర్య‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఈ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంలో వ‌న్ సైడ్ ల‌వ‌ర్‌గా.. ఫీల్ మై ల‌వ్ అంటూ యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఈ ఆర్య రిలీజ్ అయి 15 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో బ‌న్నీ త‌న స్పంద‌న‌ను తెలియ‌చేసాడు. 
 
ఇప్పటికీ నేను అంతే ప్రేమను ఫీలవుతున్నాను. నా జీవితంలో ఆర్య మ్యాజికల్‌ మూవీ. ఇది నా జీవితాన్ని మార్చేసింది. సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు పూర్తయ్యింది అంటే నమ్మలేకపోతున్నాను. సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, దిల్‌రాజుకు థ్యాంక్స్. అన్నింటికి మించి నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని బ‌న్నీతెలియ‌చేసారు.
 
ఆర్య సినిమాకి సీక్వెల్‌గా 2009లో సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో ఆర్య 2 వచ్చింది. ఈ సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. త్వ‌ర‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమాని ప్రారంభించ‌నున్నారు. బ‌న్నీ-సుక్కు క‌లిసి ఈసారి ఏం చేస్తారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments