Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తి రోజు పండ‌గే విజ‌యం ఆ.. ఇద్ద‌రిదే - అల్లు అర‌వింద్

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (21:29 IST)
సాయి తేజ్ మరో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన “ప్రతి రోజు పండగే” సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న చిత్ర యూనిట్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇక బుధవారం చిత్ర యూనిట్ “ప్రతి రోజు పండగే” విజయోత్సవ సభను రాజమండ్రిలో నిర్వహించి సక్సెస్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది.
 
రాజమండ్రిలోనే “ప్రతి రోజు పండగే” విజయోత్సవ సభని నిర్వహిస్తామని అనుకోలేదు. ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే జరిగింది. అయితే ఇక్కడే ఈవెంట్‌ని నిర్వహించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారు. మొదట్లో ఈ సక్సెస్ మీట్ సక్సెస్ అవుతుందో లేదో అని భయపడ్డాను. కానీ మన రాజమండ్రివారే దాన్ని సక్సెస్ చేశారు. 
 
తేజు అంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి తేజు అంటే ఇష్టం. అలాంటి పర్సన్‌కి ఇంతటి మంచి విజయాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు నిర్మాత బన్నీ వాసు. 
 
ఈ చిత్ర విజయం ఇద్దరిదని చెప్పాలి. మారుతి – సాయి తేజ్ ఇద్దరు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందరికంటే ఎక్కువగా ఈ విజయం వారికే దక్కుతుందన్నారు మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్. సినిమా చూసి ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమన్ సంగీతం, మారుతి దర్శకత్వం, సాయి తేజ్ నటన ఇలా అన్ని ఈ సినిమాకు కాలిసొచ్చాయి. సినిమా సక్సెస్ అయిన సందర్బంగా మరోసారి చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments