Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ల‌రి న‌రేశ్ -స‌భ‌కు న‌మ‌స్కారం లాంఛ‌నంగా ప్రారంభం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (17:51 IST)
Sabhaku namaskaram opening
ఈ ఏడాది ‘నాంది’తో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టి, విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు, విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు అందుకున్న అల్ల‌రి న‌రేశ్ హీరోగా మ‌రో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇదే ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత `తిమ్మ‌రుసు`తో సూప‌ర్‌హిట్‌ను సాధించిన‌ ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `స‌భ‌కు న‌మ‌స్కారం`. స‌తీశ్ మ‌ల్లంపాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి మ‌హేశ్ కోనేరు నిర్మాత‌. 
 
గురువారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్తపు స‌న్నివేశానికి న‌రేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్ట‌గా, పోకూరి బాబూరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. `నాంది` డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అబ్బూరి ర‌వి, అమ్మిరాజు, సుధీర్ స్క్రిప్ట్‌ను చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీశ్ మ‌ల్లంపాటికి అందించారు.
 
న‌రేశ్ 58వ చిత్ర‌మిది. ఆయ‌న పుట్టిన‌రోజున విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇలాంటి జోనర్‌లో న‌రేశ్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి. 
ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, త‌మ్మిరాజు ఎడిట‌ర్‌, అబ్బూరి ర‌వి డైలాగ్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఇత‌ర నటీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monsoon: నైరుతి రుతుపవనాలు - అంతకుముందే అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

ఏపీలో మరికొత్త జిల్లాలు.. పాత జిల్లాల పునర్విభజన చేస్తారా

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments