Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ కంట‌త‌డి- చూడ‌లేమ‌న్న‌ట్లు క‌ళ్లుమూసుకున్న టెక్నీషియ‌న్స్‌ (video)

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (17:37 IST)
sonusood-nidi
సినీ విల‌న్‌, రియ‌ల్‌లైఫ్ హీరో షూటింగ్‌ సెట్‌లో కంటతడి పెట్టారు. దానికి ఒక కారణం ఉంది. ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో సోనూ సూద్‌, నిధీ అగర్వాల్‌ జంటగా ‘సాత్‌ క్యా నిభావోగే’పాట తెరకెక్కిన విషయం తెలిసిందే. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడిన సూపర్ డూపర్ హిట్ గీతాన్ని రీక్రియేట్ చేశారు. `రోజు రాత్‌కో ఏక్ న‌యా పూల్ చాహియే ఐసా తు న క‌రేనా హోతో భూల్ జాయే..‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’  అనే పాట సాగుతుండ‌గా హీరోయిన్‌ కూర్చున కెమెరా ట్రాలీ లాగుతూ కనిపించారు. ‘ఓ హిట్‌ సాంగ్‌ తీయాలంటే ఎంతో కష్టపడాలి’ అంటూ కంట తడిపెట్టుకున్నారు.  అయితే దీనికి కూడా క‌నెక్ట్ అయిన సాంకేతిక సిబ్బంది కంట‌త‌డి చూడ‌లేమంటూ కొంద‌రు క‌ళ్ళు మూసుకోవడం విశేషం.
 
ఈ పాటలో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది. ఈ పాటను టోనీ కక్కర్‌ రచించడంతో పాటు అల్లాఫ్‌రాజ్‌తో కలిసిఆలపించాడు. ఇటీవ‌లే పాట‌ విడుదలైంది. అయితే దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను సోనూసూద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇది వైరల్‌‌గా మారింది.

ఈ పాటలో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది. కొంతమంది గుండాలను పట్టుకోవడానికి పోలీస్ అధికారి సోనూసూద్ పబ్ లోకి ఎంటర్ అయ్యి, వారిని పట్టుకుంటాడు. అదే పబ్ లో అతని మాజీ ప్రేయసి నిధి అగర్వాల్ డాన్సర్ గా ఉండటం చూసి ఆశ్యర్యపోతాడు.

అతన్ని పోలీస్ ఆఫీస్ గా చూసి ఆమె కూడా షాక్ కు గురవుతుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్ళ క్రితం పల్లెటూరిలో జరిగిన ప్రేమాయణాన్ని ఫరాఖాన్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. అనివార్య పరిస్థితుల్లో సోనూకు నిధి దూరమై పోతుంది. అయితే తిరిగి వాళ్ళిద్దరూ ఇలా కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. అదీ క‌థ‌.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments