Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ మాయలో నేనే పడిపోయా-సమంత

ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న అందాల తార సమంత అక్కినేని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అక్కినేని అనే ఇంటిపేరు వచ్చాక తనకు బాధ్యత పెరిగిందని చెప్పింది. సాధారణమైన సమంతగా తాను ఏమైనా చేయవచ్చు. ఏదైనా

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (12:05 IST)
ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న అందాల తార సమంత అక్కినేని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అక్కినేని అనే ఇంటిపేరు వచ్చాక తనకు బాధ్యత పెరిగిందని చెప్పింది. సాధారణమైన సమంతగా తాను ఏమైనా చేయవచ్చు. ఏదైనా మాట్లాడవచ్చు.. కానీ అక్కినేని అనే ఇంటిపేరు వలన తానెంతో బాధ్యతగా వుండాల్సి వుందని తెలిపింది. 
 
శైలజారెడ్డి అల్లుడు, యూటర్న్ సినిమాలు ఒకేసారి విడుదల కావడం గురించి సమంత స్పందిస్తూ.. ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్స్‌కి రావాలని ప్లాన్ చేసింది కాదని, అనుకోకుండా అలా జరిగిపోయిందంతేనని చెప్పుకొచ్చింది. ''ఏ మాయ చేసావె'' సినిమాతోనే చైతూ మాయలో పడ్డానని సమంత తెలిపింది. ఇంట్లో అపర్ హ్యాండ్ చైతూదే అని సమంత తెలిపింది. 
 
చైతూ తాను ఇద్దరం బేబీ అని పిలుచుకుంటామని.. తన మామగారు అక్కినేని నాగార్జున చాలా బాగా చూసుకుంటారని.. మంచి స్నేహితుడని చెప్పుకొచ్చింది. కమెడియన్లలో బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్ అంటే తనకు ఇష్టమని తెలిపింది.
 
చైతూ తొలి సినిమా నుంచి మంచి స్నేహితుడని, ఆయనను తాను మాయ చేయలేదని.. చైతూ మాయలో తానే పడిపోయానని సమంత చెప్పింది. ఇక అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు సమంతను పరిచయం చేశారని అలీ చెప్పాడు.
 
సమంత తన కింద పనిచేసేవారిని ఫ్యామిలీలా చూసుకుంటుందని.. అక్కినేని కుటుంబంలో మళ్లీ అన్నపూర్ణమ్మ పుట్టిందని అలీ కొనియాడాడు. సమంత కాంబోలో నటించిన అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అయ్యాయని అలీ గుర్తు చేసుకున్నాడు. షూటింగ్‌లో అందరితో కలిసిపోయే సమంత.. పేకప్ చేశాక జిమ్‌కెళ్లి వర్కౌట్స్ చేస్తుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యేడాది తర్వాత వెలుగులోకి..

అసహజ లైంగిక ప్రవర్తనతో వేధింపులు... భర్తపై భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments