Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసారైనా సల్మాన్‌తో జతకట్టేనా? ప్రియాంకపై సందేహాలు

బాలీవుడ్ స్టార్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఈమె మాటపై ఇపుడు బాలీవుడ్ హీరోలకే కాదు ప్రముఖులకు కూడా నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే గతంలో హీరో సల్మాన్ ఖాన్ నటించే "భరత్" చిత్రం

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (11:53 IST)
బాలీవుడ్ స్టార్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఈమె మాటపై ఇపుడు బాలీవుడ్ హీరోలకే కాదు ప్రముఖులకు కూడా నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే గతంలో హీరో సల్మాన్ ఖాన్ నటించే "భరత్" చిత్రంలో నటిస్తానని మాటిచ్చి చివరి నిమిషంలో హ్యాడించ్చింది. ఇపుడు మరోమారు ఇలాంటి అవకాశమే ప్రియాంకాకు వచ్చింది. దీంతో ఆమె మాటమీద నిలబడుతుందా లేదా అన్న సందేహం నెలకొంది.
 
బాలీవుడ్ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన భారీ కట్టడాలు.. కాస్ట్యూమ్స్‌తో సినిమాలను రూపొందించే దర్శక నిర్మాత. ఇప్పుడు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఈ యేడాది చివరలో సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. హుస్సేన్ జైద్ 'మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
 
ఈ చిత్రానికి 'హీరా మండి' అనే టైటిల్ పెట్టాలని సంజయ్ భావిస్తున్నారట. అయితే సల్మాన్‌ఖాన్ "భరత్" సినిమాలో నటిస్తానని చెప్పి.. చివరి నిమిషంలో ప్రియాంక తప్పుకుని సదరు సినిమా దర్శక నిర్మాతలకు లేనిపోని సమస్యలు సృష్టించింది. మరిప్పుడు సంజయ్‌ లీలా భన్సాలి ప్రియాంకతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈయనకైనా ప్రియాంక మాట తప్పకుండా సినిమా చేస్తే బావుంటుందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments