Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ ఎపిసోడ్ హైలైట్స్... మళ్లీ హౌస్‌మేట్స్ మధ్య రగిలిన చిచ్చు

బిగ్ బాస్ సీజన్ 2 సోమవారం విజయవంతంగా వందో ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కౌశల్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతులతో ఎంతో ఉత్కంఠగా కొనసాగుతోంది. సోమవారం ఎపిసోడ్ మొదటి నుండే

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (11:40 IST)
బిగ్ బాస్ సీజన్ 2 సోమవారం విజయవంతంగా వందో ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కౌశల్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతులతో ఎంతో ఉత్కంఠగా కొనసాగుతోంది. సోమవారం ఎపిసోడ్ మొదటి నుండే కౌషల్ మరియు మిగిలిన సభ్యుల మధ్య వాగ్వివాదం జరుగుతూ వచ్చింది. తనీష్ ప్రాసెస్ ఆఫ్ విన్నింగ్‌ను మీరెలా చూస్తారని కౌశల్‌ని అడగగా దానికి తను పెరిగిన విధానం వలనే గేమ్‌పై ఇంతగా ఫోకస్ చేస్తున్నానని, బయటైతే వేరేలా ఉంటానని, ఇక హౌస్‌లో బంధాలను ఏర్పరుచుకుంటే గేమ్‌పై పట్టు ఉండదని, కనుక నా బంధం కేవలం బిగ్ బాస్, ఇంకా ఆడియెన్స్‌తో మాత్రమే అని స్పష్టం చేసారు.
 
ఇంతలో తనీష్ మీకు బంధాల మీద అసలు రెస్పెక్ట్ ఉందా అని అడగడంతో వంద శాతం ఉంది అని బదులిచ్చారు కౌషల్. అలాంటప్పుడు హౌస్‌మేట్స్ బంధాలకు ఎందుకు విలువివ్వరు అని అడుగుతుండగా ఈ చర్చనంతా గీతా మాధురి రోల్, సామ్రాట్‌లకు వివరిస్తూ రోల్ రైడా చెవిలో ఏదో గుసగుసలాడింది. ఇంతలో బిగ్ బాస్ హెచ్చరించడంతో ఆ పదం బయటకు చెప్పేది కాదని, అందుకే చెవిలో చెప్పానని సర్దిచెప్పింది. వెంటనే ఎప్పట్లాగే కౌషల్ కలుగజేసుకుని గేమ్ రూల్స్ ప్రకారం గుసగుసలాడటం విరుద్ధం అని చెప్పగా ఇలాంటివాటన్నింటికీ ఈయన రెడీగా ఉంటారన్నారు. 
 
నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కి ఒక గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌లు బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న స్టోరీలను కవర్ చేయాలి, అపై వాటిని తరువాత ప్లే చేసి చూపిస్తారు, అప్పుడు స్టోరీకి సంబంధించిన వివరాలు తెలియజేయాలి.
 
ఇక మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండగా బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ లేకపోవడం ఇదే తొలిసారి అని.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఇటీవల ఇచ్చిన టాస్క్‌లను సీరియస్‌గా తీసుకోకుండా సరిగ్గా ఆడకపోవడం వలన శిక్షగా అందరినీ నామినేషన్స్‌లో ఉంచారు బిగ్ బాస్. దీనంతటికీ కారణం మీరే అంటూ కౌషల్‌ను నిందించాడు రోల్ రైడా. 
 
ఈ రెండు టాస్క్‌లలో సంచాలకుడిగా ఉంటూ ఎవరైనా గెలిస్తే వారు ఎలిమినేషన్ తప్పించుకుంటారని కావాలనే కొత్త కొత్త రూల్స్ పెట్టి అడ్డుకున్నారంటూ ఫైర్ అయ్యారు తనీష్. మిగిలినవారంతా ఈ దాడిని అలాగే కొనసాగిస్తూ మీరు సంచాలకుడిగా విఫలమయ్యారంటూ మొదలైన ఈ వివాదం కాస్తా వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments